ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. హత్రాస్‌లోని రతీభాన్‌పూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 100 మందికి పైగా భక్తులు మరణించారు. మరో వందమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. క్షతగాత్రులను ఎటాహ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. రతీభాన్‌పూర్‌లో పరమశివుడికి సంబంధించి ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు ఉత్సవాలకు ఆయా పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఎటాహ్ జిల్లా ఎస్పీ రాజేశ్ కుమార్ సింగ్ స్పందించారు. హత్రాస్ జిల్లాలోని రతీభాన్‌పూర్ గ్రామంలో శివుడి ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనలో 100 మందికి పైగా భక్తులు మృతి చెందారని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా హత్రాస్ ఘటనపై లోక్ సభలో ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.