తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు రాష్ట్రంలోని పలు మెడికల్ షాపులపై సోదాలు నిర్వహించారు. అను మతి లేకుండా మెడిసిన్స్ నమ్ముతున్న ఆస్పత్రులపై కేసులు నమోదు చేశారు. వనపర్తి లోని శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ లో సోదాలు చేయగా.. ఎలాంటి లైసెన్స్ లేకుండా మందులు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఆసుపత్రి పై కేసు నమోదు చేసి 80 వేల విలువైన మెడిసిన్స్ స్వాధీనం చేసుకున్నారు. అటు హైదరాబాద్ చార్మినార్ లోని నూర్ఖాన్ బజార్ లో ఓ మెడికల్ షాప్ లోనూ సోదాలు నిర్వహించారు. ఇక్కడ కూడా అనుమతులు లేకుండా మందులు అమ్ముతున్నారని గుర్తించి కేసు నమోదు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు.