Nikhat Zareen | ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్-2023 లో యాభై కిలోల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించిన నిఖత్ జరీన్ ను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్(Anjani Kumar) లు శుక్రవారం దుశ్శాలువా, పుష్పగుచ్చాలతో అభినందించారు. బీఆర్ కేఆర్ భవన్ లో సి.ఎస్.శాంతి కుమారి(CS Shanti Kumari)ని.. నిఖత్ జరీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ చాంపియన్ షిప్ ను సాధించి భారత దేశంతో పాటు తెలంగాణా ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలిపిన నిఖత్ జరీన్ ను సి.ఎస్. శాంతి కుమారి అభినందించారు. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు గెలుచుకున్న రెండవ భారతీయ బాక్సర్‌గా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించిందని, నేటి యువ క్రీడాకారులకు జరీన్(Nikhat Zareen) ఆదర్శవంతంగా నిలిచిందని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్.సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాలు పాల్గొన్నారు.
Read Also: హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
Follow us on: Youtube, Instagram, Google News