తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. ఓవైపు తమకు పదవి దక్కుతుందో లేదోనన్న టెన్షన్‌లోఆశవాహులు ఉంటే ఇచ్చిన పదవి వెనక్కిలాగేసుకుంటారేమోనన్న అనుమానంతో మరికొందరు ఆందోళనలో ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్ జీవోలు అందుకోవడానికి రెడీగా ఉన్న లీడర్లు అందుకోసం పడిగాపులు కాస్తున్నారు. ఎన్నికల కోడ్ అంటూ దాటవేసిన అధిష్టానం జీవోలు ఎప్పుడు ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మరి కోడ్ ముగిసి వారం దాటినా జీవోలు ఇవ్వకపోవడనికి కారణాలేంటి..? ఇంతకీ ఇచ్చిన పోస్ట్ ఉన్నట్టా, ఊడినట్టా..?
తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ కోసం పని చేసిన లీడర్లు, సీనియర్లు పదవుల కోసం తపిస్తున్నారు. ఎప్పుడు తమను పదవి వరిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మరోపక్క ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ పదవులకు జీవోల కోసం పడిగాపులు కాస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్‌కు రెండు రోజుల ముందు 37 మంది పార్టీ నేతలకు కార్పోరేషన్ ఛైర్మన్‌లను ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాటి వరకూ జీవోలను ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ కారణంగా జీవోలు ఇవ్వలేమని చెప్పిన హైకమాండ్ కోడ్ ముగిసి వారం రోజులవుతున్నా ఇప్పటికీ ఆ ఊసే లేదు. దీంతో ఎక్కడ తమ పేర్లను తొలగించి ఇంకొకరిని చేరుస్తారో అన్న అనుమానంతో ఆందోళనలో ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఇస్తామని పెద్దలు ప్రకటించినా ఇప్పటికీ మోక్షం లభించకపో వడంతో హైరానా పడుతున్నారు. అయితే, జీవోల ఆలస్యానికి కారణం మార్పులు చేర్పులేనన్న ప్రచారంతో మరింత టెన్షన్ పడుతున్నారు.
కోడ్ ముగిసిన వెంటనే అందాల్సిన జీవోల ఆలస్యంపై ఆరా తీస్తున్నారు కార్పొరేషన్ చైర్మన్‌లు. పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మరికొందరు మంత్రుల వల్లే జాప్యం జరుగుతున్నట్టు గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తుండటతో అందుకు కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే కొందరు నేతలు తమకు ఛైర్మన్ పోస్టులు ఇవ్వాలని దీపాదాస్ మున్షీ కి మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చైర్మన్ పదవి ఆశిస్తున్న వారికి కూడా ఈ పోస్టులు ఇవ్వాలన్న దీపాదాస్ సూచన మేరకు జీవోలపై ఆలస్యం జరగుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా కొందరికి చైర్మన్ పోస్టు ఇవ్వడం పట్ల పలువురు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. మళ్లీ కొత్త లిస్టు తయారు చేసే పనిలో పడటంతో మరింత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది.
ఇక మరోపక్క కొందరికి జీవోలో సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారికి జీవో విషయంలో ఆందోళన వద్దని పార్టీ పెద్దలు ధైర్యం చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే, మరికొందరి విషయంలో మాత్రం అభ్యంతరం తో జీఏడి నుంచి జీవోలు వచ్చినా వాటిని ఇవ్వకుండా అడ్డుపడటంతోనే ఆలస్యమవు తోంద ని వీలైనంత త్వరగా అందరికీ జీవోలు అందజేస్తా మని పార్టీ పెద్దలు భరోసా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే మిగిలిన పదవులపై ఫోకస్ పెట్టింది హస్తం హైకమాండ్. దీంతో ఆశావహులంతా గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సీఎం, మంత్రులనే కాకుండా ఎంపీలను కాకపడుతు న్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న నేతలే కాకుండా ఇటీవల తీర్థం పుచ్చుకున్న లీడర్లు సైతం గట్టిగా ప్రయ త్నాలు చేస్తున్నారు. మరి ఇలాంటి పరిణామాల మధ్య హైకమాండ్ మనసులో ఉన్నదెవరు. ఎవరికి ఏ పదవులు కట్టబెట్ట నుందన్నది ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తుండగా మరోపక్క ఇప్పటికే ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ పదువుల్లో మార్పులు చేర్పులు ఉండనున్నాయా, అదే జరిగితే ఎవరి పేరులో ఎవరిని మారు స్తారు..? ఎవరిని పక్కన పెడతారు అన్నది ఆసక్తికర అంశంగా మారింది.


