స్వతంత్ర వెబ్ డెస్క్: డిసెంబర్‌లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల నాయకత్వంలో బీజేపీ అధిష్ఠానం పలు మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జ్‌లను బీజేపీ అధిష్ఠానం నియమించింది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఎన్నికల ఇంఛార్జ్‌లను నియమించారు. ఈ క్రమంలో తెలంగాణకు ఎన్నికల ఇంఛార్జ్‌గా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను నియమించారు. కాగా.. ఎన్నికల సహ ఇంఛార్జ్‌గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ను నియమించారు. మరో ఐదారు నెలల్లో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించిన విషయం తెలిసిందే.
ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఇంఛార్జ్‌గా ఓపీ మాథుర్, సహాయ ఇంఛార్జ్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా మన్‌సుఖ్ మాండవీయ, రాజస్థాన్ ఇంఛార్జ్‌గా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ ఇంఛార్జ్‌గా గుజరాత్ మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్‌గా భూపేంద్ర యాదవ్, సహాయ ఇంఛార్జ్‌గా కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను నియమించింది.