హరికేన్ తుపాను కారణంగా టీమిండియా ఆటగాళ్లు వెస్టిండీస్ లోని బార్బడోస్ లో చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణంతో బార్బడోస్‌లో ఉండిపోయారు. ప్రస్తుతం వారంతా అక్కడి హోటల్ గదుల్లోనే ఉన్నారు. టీమ్‌ఇండియా 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ గెలవడంతో యావత్ భారతావని సంబరాల్లో మునిగితోలుతోంది. టీమ్‌ఇండియా ప్లేయర్లకు సొంత గడ్డపై ఘన స్వాగతం పలికేందుకు భారత్ సిద్ధమైంది. కానీ, ఫ్యాన్స్ ఆశలపై హరికేన్ నీళ్లు చల్లింది. ఈ హరికేన్ కారణంగా భారత ఆటగాళ్లు స్వదేశం రావడం ఆలస్యం కానుంది. టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఉన్న బార్బ డోస్‌తో పాటు సెయింట్ లూసియా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్ దీవులపై బెరిల్ హరికేన్ పంజా విసురు తోంది. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.బెరిల్ హరికేన్ కారణంగా ఆ ప్రాంతంలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసివే శారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల భారత ఆటగాళ్లు తాము బస చేస్తున్న హోటల్‌కే పరిమిత మయ్యారు. బార్బడోస్‌లో కర్ఫ్యూ దృష్ట్యా టీమ్‌ఇండియా ఆటగాళ్ల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పరిస్థితులు మెరుగుపడే వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.


