స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: నేడు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో టీడీపీ, వైసీపీ పాదయాత్రలు, బైక్ ర్యాలీలు పోటాపోటీగా నిర్వహించనున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు… ర్యాలీలకు, పాదయాత్రలకు అనుమతిని నిరాకరించారు. ఈ క్రమంలో తుళ్లూరు మండలంలో 144వ సెక్షన్ అమలు చేశారు. హోరాహోరిగా సాగనున్న ఈ బైక్ యాత్రలతో రాజధాని నగరంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగనుంది. ఇప్పటికే పోలీస్ బలగాలు అమరావతికి చేరుకున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.