స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు వైసీపీ మంత్రి ఆర్కే రోజా. అమరావతి భూములను నిరుపేదలకు అందించడాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుపేదల జీవితాలు బాగుపడడం చంద్రబాబుకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. నిరుపేదలకు ఇచ్చే స్థలాలను సమాధులతో పోల్చడమేంటి..? 2024 ఎన్నికల్లో ఆ సమాధుల్లోనే టీడీపీని ప్రజలు పూడ్చేస్తారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు మావే.. వాలంటీర్ల వ్యవస్థను జనం మెచ్చుకుంటే చంద్రబాబు మాత్రమే రాజకీయం చేస్తున్నారని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థలో సరికొత్త మార్పును తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి ఆర్కే రోజా అభిప్రాయపడ్డారు.


