TDP Politburo |ఆంధ్రప్రదేశ్ లో మూడు పట్టభద్రుల శాసనమండలి సభ్యుల గెలుపుతో పాటు.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని గెల్చుకున్న తర్వాత.. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంతో కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలపర్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించేందుకు ఇవాళ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉదయం 10గంటల30 నిమిషాలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో
పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై పోరాటం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయం, వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజల ఇబ్బందులు వంటి అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
41 వసంతాల టిడిపి ప్రస్థానం, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలపై కూడా చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాలు, రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం, నదీ జలాల్లో న్యాయబద్ధమైన హక్కులు వదిలేస్తున్న వైసీపీ ప్రభుత్వం వంటి అంశాలపై సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. నాలుగేళ్లలో ప్రజలపై 57 వేల కోట్ల విద్యుత్ భారాలు, మద్యంలో 38 వేల కోట్ల అవినీతి… తదితర అంశాలపై పొలిట్‌బ్యూరో(TDP Politburo) చర్చించనుంది. వచ్చే మహానాడుని రాజమండ్రి లో నిర్వహించే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Read Also: వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది: నారా లోకేశ్
Follow us on: Youtube , Instagram