స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స కొనసాగుతోంది. రాజేంద్రప్రసాద్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. యాంజియోగ్రామ్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
రాజేంద్రప్రసాద్కు గుండెపోటు వచ్చిందన్న వార్త తెలిసి టిడిపి అధినేత చంద్రబాబు దిగ్ర్భాంతికి గురయ్యారు. రాజేంద్రప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గుండె పోటుకు గురైనట్లు తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.


