మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యలో సీఎం జగన్ కుటుంబం పాత్ర ఉందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారితో పాటు విచారణ ఎదుర్కొంటున్న వారంతా కేవలం పాత్రధారులు మాత్రమే అని.. అసలు సూత్రధారులు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో జగన్, భారతి పాత్రలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అవినాశ్ రెడ్డి, భాస్కరరెడ్డి లాంటి వారు జగన్ చేతిలో తోలుబొమ్మలని.. జగన్ దంపతులను విచారిస్తే అసలు విషయాలన్ని బయటకు వస్తాయన్నారు. భవిష్యత్ లో చంచల్ గూడ జైలులోనే జగన్ కాపురమంటూ పట్టాభి విమర్శించారు.