స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం సంతోషకరమని అన్నారు ఎంపీ నందిగం సురేష్. దీనిపై టీడీపీ నేతలు ఏడుపుగొట్టు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి సంపద అంతా మా చేతుల్లోనే ఉండాలని వారు అంటున్నారని వ్యాఖ్యానించారు. నేటి సుప్రీంకోర్టు తీర్పుతో అణగారిన జనాలకు మంచి పరిణామం ఏర్పడిందని అన్నారు. టీడీపీ నేతల దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనించాలని అన్నారు.


