కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని నిత్యావసర సరుకుల హోల్‌సేల్ దుకాణాల ప్రారంభానికి ఆహ్వానం లేదంటూ టీడీపీ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. పిఠాపురంలో కూరగాయల మార్కెట్ సెంటర్, ఉప్పాడ బస్టాండ్, కోట గుమ్మం జంక్షన్‌లో ఉన్న దుకాణాలను నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. జనసేన నాయకులను పిలిచి టీడీపీ నాయకులను పిలవకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని టీడీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. పిఠాపురంలో టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారని గుర్తించాలంటూ టీడీపీ కోఆప్షన్ నాయకులు నగేష్ ఆగ్రహించారు. పిఠాపురంలో టీడీపీ కౌన్సిలర్లు ఉన్నట్టు తమకు తెలియదు అంటూ తాహసిల్దార్ సమాధానం ఇవ్వడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.