తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త అందించింది. ఇక నుంని బహిరంగ ప్రదేశాల్లోనూ మద్యం సేవించేందుకు అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్న రూల్ ప్రకారం బార్లు, వైన్ షాప్స్ పర్మిట్ రూంలలోనే మద్యం సేవించాలి. అయితే స్టాలిన్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఇకపై ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవించవచ్చు.
కల్యాణ మండపాలు, సమావేశ మందిరాలు, కన్వెన్షన్ సెంటర్లు, స్టేడియాలు ఇలా తదితర ప్రదేశాల్లో మద్యం తాగేందుకు ప్రత్యేక లైసెన్సింగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆదాయం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల అసాంఘిక కార్యకలాపాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని మండిపడుతున్నాయి.