రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ వాసి అరవింద్ యాదవ్ ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉద్యోగరీత్యా సిడ్నీలో స్థిరపడిన అరవింద్ ఐదు రోజుల క్రితం నుంచి కనిపించకుండాపో వడంతో కుటుంబ సభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సముద్రంలో అరవింద్ మృతదేహం లభ్యమైనట్టు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. అరవింద్‌ది హత్యా ? లేక ఆత్మహత్యా ?అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 12 ఏళ్లుగా ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియా లో స్థిరపడ్డ అరవింద్ కి 16 నెలల క్రితం వివాహం అయ్యింది.


