వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం రద్దు చేసింది. దీంతో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐకి లైన్ క్లియర్ అయింది. మరోవైపు గతంలో ఏప్రిల్ 30వరకు ఇచ్చిన సీబీఐ విచారణ గడువును జూన్ 30వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా సునీత, అవినాశ్ రెడ్డి లాయర్ల తరపున వాదనలు విన్న ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది. కాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై వివేకా కూతురు సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.