Amaravati Case | రాజధాని అమరావతి కేసుల విచారణ అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు(Supreme court)లో చుక్కెదురైంది. విచారణను త్వరగా పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తిని జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం తిరస్కరించింది. మార్చి 28వ తేదినే విచారణ చేపడతామని స్పష్టంచేసింది. అయితే ఒక్కరోజే విచారణకు సరిపోదని.. 29,30వ తేదీల్లో కూడా విచారణ జరపాలని న్యాయవాదులు కోరారు. బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చిన కేసులను విచారణ జరపరాదని సీజీఐ(CJI) సర్క్యూలర్ ఉందని గుర్తుచేసింది. రాజధాని అమరావతి(Amaravati) కేసు చాలా పెద్దదని.. అందులో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఉన్నాయని.. అన్ని అంశాలు పరిశీలించి తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని జస్టిస్ జోసెఫ్ తెలిపారు.
Read Also: గవర్నర్ తమిళిసైపై సుప్రీంను ఆశ్రయించిన టీసర్కార్
Follow us on: Youtube