స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. జూన్ 30 తర్వాత గంగిరెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ గత నెల 27న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. . ఈ ఉత్తర్వుల్లో జులై 1న గంగిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని తెలిపింది. అయితే హైకోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారించిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ తీర్పు ఇచ్చింది.