Superstar Rajinikanth | ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడ చేరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజినీకాంత్ విచ్చేశారు. విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న రజనీకాంత్‌కు నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో సాయంత్రం ఎన్టీఆర్ శతజయంతి అంకురార్పణ సభ జరగనుంది. ఈ సభకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించనున్నారు.