తిరుమల, అయోధ్య తరహాలో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుతామని విజయవాడ పశ్చిమ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. ముస్లిం మైనారిటీలకు హజ్ హౌస్ నిర్మాణం చేస్తామని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని సుజనా దుయ్యబట్టారు. కొండ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతామని చెప్పారు. ఇది ధర్మం-అధర్మం మధ్య జరుగుతోన్న యుద్ధమని అభివర్ణిం చారు. వైసీపీ పాలనలో అంతా విధ్వంసమేనన్నారు. ఏపీలో, దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావడం ఖాయమని, తాము గెలిచాక 22 డివిజన్లలో కార్యాలయాలు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున సుజనా రోడ్ షో చేస్తున్నారు. సుజనా రోడ్ షోకు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. దారిపొడవునా సుజనాకు మద్దతుగా అభిమానులు నినాదాలు చేశారు.


