35.2 C
Hyderabad
Sunday, May 26, 2024
spot_img

బీజేపీ నేత దేవరాజేగౌడ అరెస్ట్

   కర్ణాటక లోని హసన్ లోక్ సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల కేసులో బీజేపీ నాయకుడు దేవరాజే గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజ్వల్ లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలుగల పైన్ డ్రైవ్ లీకేజీలో దేవరాజే గౌడ కీలక పాత్రవహించారని ఆరోపణలు ఉన్నాయి. హసన్ పోలీసుల సమా చారం మేరకు హిరియార్ పోలీసులు దేవరాజేగౌడను అరెస్ట్ చేసి హెళె నరసిపుర కు తరలించారు. వీడియోల లీకేజీకి తనకు సంబంధం లేదని దేవరాజే గౌడ పోలీసులకు తెలిపారు.

హసన్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల మహిళ తన ఆస్తిని అమ్మడానికి సహాయం చేస్తాననే నెపంతో తనను వేధించాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో గౌడపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏప్రిల్ 26న కర్ణాటకలో తొలి దశ లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజ్వల్ కు సంబంధించిన పలు అశ్లీల వీడియోలు చక్కర్లు కొట్టాయి. అదే రోజు ప్రజ్వల్ పోటీ చేస్తున్న హసన్ లోక్ సభ నియోజకవర్గం లోనూ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కు కొద్ది గంటల ముందు వీడియోలు గల పెన్ డ్రైవ్ వెలుగులోకి వచ్చింది.ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్ డి దేవగౌడ మనుమడు. రేవణ్ణ కొడుకు. విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ కోసం బ్లూ కార్నర్ నోటీసు ఇంటర్ పోల్ ద్వారా జారీ అయ్యాయి.

Latest Articles

ముంచుకొస్తున్న రెమాల్ తుఫాన్

రెమాల్ తుఫాను దూసుకొస్తోంది. బెంగాల్‌, అస్సోం, మేఘాలయలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. తుఫాను కారణంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేసి, విమాన రాకపోకలు నిలిపివేస్తు న్నారు. బంగాళాఖాతంలో రెమాల్‌ తుఫాన్‌ బలపడింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్