ఒక విద్యార్థి స్కూల్ ప్రాంగణంలోనే చనిపోయి కన్పించడంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు, జనం ఏకంగా స్కూల్ నే తగులపెట్టారు. బీహార్ లోని పట్నాలో టినీ టాట్ అకాడమీ స్కూల్ జనం ఆగ్రహానికి దగ్దమైంది. విద్యార్థి స్కూల్ లో ప్రవేశించినట్లు సిసిటీవి లో నమోదయిందని, అతడు స్కూల్ ప్రాంగణం విడిచి వెళ్లినట్లు కన్పించలేదని. విద్యార్థి శవాన్ని వారు దాచి పెట్టినందువల్ల హత్య కేసుగా దీనిని దర్యాప్తు చేస్తున్నామని, పట్నా ఎస్పీ చంద్ర ప్రకాశ్ తెలిపారు. స్కూల్ యాజమాన్యానికి సంబంధించి ముగ్గురిని అరెస్టే చేసి విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.


