పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోటప్పకొండలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర వేద విజ్ఞాన్ పీఠం వేదపాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని కుందుర్తి సాయి శివ సూరజ్ (18) అనే విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్ది సూరజ్‌ది ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబాల పట్నం గ్రామం. 4 సంవత్సరాల క్రితం వేదపాఠశాలలో చేరాడు. మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థి ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థి సూరజ్ మృతి చాలా బాధాకరమని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. వేద పాఠశాల విద్యార్థి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ప్రభుత్వ పరంగా సూరజ్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు.