దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 93 పాయింట్ల నష్టంతో 57,461 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 16,936 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు పతనమై 82.76 గా ఉంది . సెన్సెక్స్ 30 సూచీలో టైటన్, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, రిలయన్స్, టెక్ మహీంద్రా నష్టాల్లో కొనసాగుతున్నాయి.