Stock Market |అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు చోటుచేసుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. అమ్మకాల ఒత్తిడి ఏర్పడటంతో కాసేపటికే నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఈరోజు ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 71 పాయింట్ల నష్టంతో 58,166 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 17,125 దగ్గర కొనసాగుతోంది.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.34 దగ్గర ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, టైటన్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, ITC, TCS షేర్లు లాభాల్లో ఉండగా.. ఎంఅండ్‌ఎం, బజాజ్ ఫైనాన్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో ఉన్నాయి.
Read Also: పవన్ కళ్యాణ్ యాత్ర కోసం ‘వారాహి’ వాహనం సిద్ధం
Follow us on: Youtube Instagram