తెలంగాణలో రానున్న 3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది వాతావరణశాఖ. ఈ మూడు రోజులు ఉరుములు మెరుపులతో వానలు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలపైన నమోదయ్యే అవకాశం ఉందని.. రాష్ట్రం వైపుగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు.