స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 10:19 గంటల సమయంలో సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో 63,208 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 18,746 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.59 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, టైటన్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, మారుతీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు నెలకొన్నాయి. రేట్ల పెంపుపై ఆర్‌బీఐ నుంచి మరికాసేపట్లో కీలక నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆరంభంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.