విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉక్కు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ప్లాంట్ ప్రైవేణీకరణ జరిగి తీరుతుందని కేంద్రం మరోసారి స్పష్టంచేయడంతో కార్మికులు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, నిర్వాసితులు కూర్మన్నపాలెం నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు. తాత్కాలికంగా ప్రైవేటీకరణ ఆపేస్తామని.. అలాంటిదేమి లేదు ప్రైవేటీకరణ చేపట్టి తీరుతామని కేంద్రం విరుద్ధ ప్రకటనలు చేయడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేంద్రం రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ప్రైవేటీకరణపై కేంద్రం దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేస్తున్నారు.