ఇవాళ ఏపీలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11గంటలకు సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలపై చర్చించనున్నారు. పీ4 విధానం అమలు అంశాలు.. టిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్ర రుణాలు.. స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి వంటి కేంద్ర పథకాలపైనా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. పీ4 విధానం అమలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. సామాన్యులకు దగ్గరగా బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలనే దిశగా బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు సూచనలు చేయనున్నారు.