స్వతంత్ర, వెబ్ డెస్క్: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్(WTC) ఫైనల్ మ్యాచ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుంది. అయితే భారత్, ఆసీస్ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లను ధరించి మైదానంలో అడుగు పెట్టారు. ఇటీవల ఒడిశాలో జరిగిన భారీ రైలు ప్రమాదంలో 288 దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. దీంతో మృతి చెందిన వారికి సంతాపసూచికంగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి నివాళులర్పించారు. మరోవైపు నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో టీమ్‌ఇండియా బరిలోకి దిగింది. అలాగే తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మకిది 50వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం.