sphoorthi kutumbam Online Yoga classes: ‘‘యోగాలో ‘ధ్యానం’ ప్రధానం. అందులో ముఖ్యమైనది ‘ప్రాణాయామ’ సాధన. అలా చేస్తూ వెళుతుంటే, అక్కడ జరిగే ప్రస్థాన ధ్యాన సాధన ద్వారా మనిషి తన జీవిత కాలంలో పరమాత్మ స్థాయిని చేరి, విశ్వమూలాలను తెలుసుకునే వీలు కలుగుతుంది’’ -గురు విశ్వస్ఫూర్తి
ఆధ్యాత్మిక విశ్వ గురువు, వైజ్ఞానిక రుషి గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో మాఘ పౌర్ణమి సందర్భంగా ‘స్ఫూర్తి కుటుంబం’’ ఆన్‌లైన్ ద్వారా ‘ ప్రస్థాన సాధన’ పేరుతో శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది.
జనవరి 29న ప్రారంభమైన ఈ తరగతులు.. ఫిబ్రవరి 4 వరకూ వారం రోజులు కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 4.30 నుంచి ఉదయం 7 గంటలకు నిర్వహించే ఉచిత ఆసన, ప్రాణాయామ ధ్యాన సాధనలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇలా తొలిరోజు ఉదయం సుప్రభాతంతో మొదలయ్యాయి. గురుదేవులకు స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ తెలంగాణ సభ్యులు పూల మాలలు సమర్పించారు.
కళ్లు మూసుకుని ప్రశాంత చిత్తంతో ‘ధ్యానం’ చేసే విధానం, అవగాహన స్థాయి, వీటన్నింటి ఆధారంగా అవి మనుషులపై దశల వారీగా ఫలితాలు చూపిస్తుంటాయని యోగా గురువులు చెబుతున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమాజహితం కోసం గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్ఫూర్తి కుటుంబానికి అభినందనలు అని తెలిపారు. ‘ఈ ప్రస్థాన సాధనలో ఆసన, ప్రాణాయామ ధ్యానం, వీటి ఆవశ్యకత చెప్పాలంటే, ఒక్కసారి సమాజంలోని పరిస్థితులను గమనించాల్సి అవసరం ఉందని అన్నారు.
సమాజంలో ఎక్కడ చూసినా హింస ప్రజ్వరిళ్లుతోంది. దాని ఫలితం ఎంత ఘోరంగా ఉందో మన కళ్లతో చూస్తున్నామని తెలిపారు. ఇలాంటి సమయంలో సమాజంలో మార్పు రావాలి. అది వ్యక్తి నుంచే ప్రారంభం కావాలని అన్నారు.
అది జరగాలంటే మనిషి ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి అని అన్నారు. అలా మనిషి హృదయంతో స్పందించినప్పుడే తాను మారతాడు, సమాజంలో మార్పు తీసుకురాగలడని వివరించారు. ఇవన్నీ జరగాలంటే యోగా, ధ్యానం మనుషులకు చాలా ముఖ్యమని తెలిపారు.