తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం తూర్పు దళితవాడలో దాదాపు 210 బస్తాల రేషన్ బియ్యాన్ని స్పెషల్ బ్రాంచ్ ప్రత్యేక పోలీసు బృందం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. జిల్లా SP హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు SB పోలీస్ బృందం అక్రమ రేషన్ బియ్యం తరలింపుపై ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నాగలాపురం తూర్పు కాలనీలో బియ్యం లోడ్ తో ఉన్న లారీని పట్టుకున్నారు. దాదాపు పది టన్నులు రేషన్ బియ్యం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
పట్టుబడిన బియ్యాన్ని గ్రామాలలో సేకరించి విక్రయించడంతో పాటు రేషన్ దుకాణాల నుంచి కూడా సేకరించి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. లారీతో పాటు లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని స్పెషల్ బ్రాంచ్ బృందం, నాగలాపురం ఎస్ఐ విచారిస్తున్నారు.