స్వతంత్ర వెబ్ డెస్క్: కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ప్రగతి భవన్ నుంచి పిలుపు వెళ్లింది. కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో నియోజకవర్గంపై బీఆర్ఎస్ అధిష్టానం దృష్టిసారించింది. ఈ నెల 7వ తేదీన ప్రగతిభవన్‌లో కామారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చర్చలు జరపనున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో.. ఈ చర్చల ద్వారా క్యాడర్‌ను సమాయత్తం చేయనున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే.. నియోజకవర్గ అభివృద్ధిపైనా ఆయన చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్నికల షెడ్యూల్‌తో సంబంధం లేకుండా కామారెడ్డిలో పర్యటించడం.. బహిరంగ సభ, ర్యాలీలు తదితర అంశాలపైనా ఈ భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ పోటీని సవాల్‌గా తీసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో బీజేపీ తరపున ఎంపీ అర్వింద్ బరిలోకి దిగొచ్చనే ప్రచారం నడుస్తోంది.