నైరుతీ రుతుపవనాలు ఏపీలోకి వచ్చేశాయి. రుతుపవనాల రాకతో ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారంతా సేద తీరేలా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విస్తారంగా వర్సాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. రుతుపవనా లు వేగంగా వీచేందుకు అనుకూలమైన వాతావరణం ఉంది అని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం కొనసాగు తోంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఆదివారం సాయంత్రం రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయి. రెండు మూడు రోజుల్లో రుతు పవనాలు ఏపీ అంతటా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈదురు గాలులు వీస్తాయని, అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రుతపవనాల ప్రభావంతో ఇవాళ ఏపీలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రుతుపవనాలతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుంది. జూన్ నెలలో సాధరణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.
ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, బాపట్ల, పల్నాడు ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని అధికారు లు సూచించారు. ఆదివారం రాత్రి ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 125 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లా పాణ్యంలో 113 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47, చిత్తూరు జిల్లా పుంగనూరులో 33, కాకినాడ జిల్లా గండేపల్లిలో 23, అల్లూరి జిల్లా అనంతగిరిలో 22, కాకినాడ జిల్లా పెదపూడిలో 20 మిల్లిమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.


