ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో కుప్పంలో పర్యటించనున్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన కుప్పం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన అక్కడకు వెళ్లనున్నారు. ఈనెల 23, 24న చంద్రబాబు కుప్పంలో పర్యటించే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆయన కుప్పం వెళ్లనున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లాస్థాయి అధికారులతో ఆయన సమావేశమవుతారు. కుప్పంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశమవుతారు చంద్రబాబు.