24.2 C
Hyderabad
Tuesday, December 2, 2025
spot_img

కార్తీక్ రత్నం ‘లింగొచ్చా’ నుంచి ఫిదా సాంగ్ రిలీజ్

టాలీవుడ్‌లో తక్కువ టైంలో నటుడిగా చాలా మంచి పేరు సంపాదించిన కార్తిక్ రత్నం హీరోగా, స్టన్నింగ్ బ్యూటీ సుప్యర్ద సింగ్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న చిత్రం ‘లింగొచ్చా’. ఆనంద్ బడాని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీకాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో యాదగిరి రాజు నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 27న విడుదల కానుంది. ఆ చిత్రానికి జె నీలిమ సమర్పిస్తుండగా మల్లేష్ కంజర్ల సహ నిర్మాతగా నిర్వహిస్తున్నారు.

సోహెల్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఈ ఫంక్షన్‌కి నేను రావడానికి ముఖ్య కారణం కరీముల్లా. ఆయన పాడిన పాటలు జై బాలయ్య సాంగ్, అలాగే ఆయనతో నాకున్న కనెక్షన్ మంచి క్లోజ్ ఉండడంవల్ల అండ్ నాకిష్టమైన వ్యక్తులు కార్తీక్ రత్నం అండ్ సుహాస్. వీళ్లిద్దరూ ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన వ్యక్తులు. వాళ్ల గురించి కూడా నేను మాట్లాడతాను. సో వాళ్ళ ఫంక్షన్‌లు ఏమున్నా ఈవెంట్లు ఏమున్నా వాళ్ళకి సపోర్ట్‌గా నిలబడతాను’’ అని అన్నారు.

ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ‘‘లింగొచ్చా సినిమా అక్టోబర్ 27న రిలీజ్ అవుతుంది. అలాగే మంచి సక్సెస్ అవ్వాలని, అవుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము’’ అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘లింగొచ్చా సినిమా చాలా మంచిగా వచ్చిందని ప్రొడ్యూసర్లు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం వల్ల ఈ సినిమాని చాలా గ్రాండ్‌గా తీసుకున్నామని చెప్తున్నారు. అలాగే కార్తీక్ రత్నాన్ని చాలా కొత్తగా చూడొచ్చు. ఈ సినిమాలో చాలా మంచి యాక్టింగ్ చేశాడు. కార్తీక్ రత్నానికి మంచి ఫ్యూచర్ ఉంది.’’ అని అన్నారు.

హీరో కార్తీక్ రత్నం మాట్లాడుతూ ‘‘ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది.. ఎందుకంటే ఆనంద్ కొత్తవాడైనా కూడా కొత్తదనం తనలో కనబడకుండా ఎంతో ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా ఈ సినిమాను తీసుకుని వచ్చాడు. అలాగే ప్రొడ్యూసర్లు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా దర్శకుడికి, టీంకి మంచి సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని కరెక్ట్‌గా అనుకున్న విధంగా తీసేలాగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని  కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ ఫిదా కూడా మంచి ఆదరణ పొందుతోంది.’’ అని అన్నారు.

నటీనటులు: కార్తిక్ రత్నం, సుప్యర్ధ సింగ్, ఉత్తేజ్, తాగుబోతు రమేష్, కునాల్ కౌషిక్ . కె, ఫిదా మౌగాల్, ప్రేమ్ సుమన్, భల్వీర్ సింగ్, పటాస్ సద్దామ్, కె. నరసింహ(మిమిక్రి ఆర్టిస్ట్), ఇస్మాయిల్ భాయ్, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్ తదితరులు

దర్శకత్వం.. ఆనంద్ బడా
నిర్మాత.. యాదగిరి రాజు
సహ నిర్మాత.. మల్లేష్ కంజర్ల
సమర్పణ.. జే. నీలిమ
రచయిత.. ఉదయ్ మదినేని
సంగీతం.. బికాజ్ రాజ్
ఎడిటర్.. మ్యాడి అండ్ షాహి బదా
ఎగ్జెక్యూటివ్ ప్రోడ్యూసర్.. ఎ ఆర్. సౌర్య
ప్రోడక్షన్ డిజైన్.. అనిల్ కుమార్ తీగల
లైన్ ప్రోడ్యూసర్.. సందీప్ తుంకూర్, శ్రీనాథ్ చౌదరి,
పీఆర్వో: ఏలూరు శ్రీను , ధీరు – ప్రసాద్ లింగం

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్