పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సామాజిక సమతుల్యత కరువు

 పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సామాజిక సమతుల్యతను పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గెలుపు గుర్రాల వైపే మొగ్గు చూపుతున్న రాష్ట్ర నాయకత్వం.. ఎస్సీలతో పాటు బీసీలకు అన్యాయం చేస్తోందన్న అసంతృప్తిలో ఉన్నారు ఆశావహులు.

ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో రెండింటినీ మాలలకే ఇవ్వడంపై మాదిగలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనాభా ప్రాతి పదికన అత్యధికంగా ఉన్న మాదిగలను పక్కనపెట్టడంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. పెద్దపల్లి, నాగర్‌ కర్నూల్‌ స్థానాల్లో మాలలకు అవకాశం ఇవ్వడం పట్ల ఫైర్‌ అవుతున్నారు. పెద్దపల్లి బరిలో వంశీకష్ణ, నాగర్‌ కర్నూల్‌ నుంచి మల్లురవికి టికెట్‌ కేటాయించింది కాంగ్రెస్‌ అధిష్టానం. దీంతో తమ వర్గానికి టికెట్‌ కేటాయిం చాలని డిమాండ్‌ చేస్తున్నారు మాదిగలు. మరోపక్క బీసీ నేతలు కూడా తమకు 7 స్థానాలు కేటాయిం చాలని పట్టుబట్టారు. అయిపన్పటికీ వారికి నిరాశే మిగిలింది. ఇప్పటి వరకూ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే బీసీలకు అవకాశమిచ్చింది. జహీరాబాద్‌ నుంచి సురేష్‌ షెట్కార్‌, సికింద్రాబాద్‌ బరిలో దానం నాగేందర్‌, మెదక్‌ నుంచి నీలం మధు ముదిరాజ్‌లను బరిలో దించింది. పెండింగ్ స్థానాల్లో కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ ఉన్నాయి. ఈ స్థానాల్లో బీసీలకు టికెట్‌ కేటాయించాలని పట్టుపడుతున్నారు బీసీ నేతలు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్