26.2 C
Hyderabad
Tuesday, February 3, 2026
spot_img

విజయవాడ: డ్రైనేజీలో పడి గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా గురునానక్‌ కాలనీలో అభి అనే ఆరేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ మురుగుకాల్వలో పడిపోయాడు. కుండపోత వర్షం పడడంతో డ్రైనేజీల్లో వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో గురునానక్‌ కాలనీ వద్ద ఓ డ్రైనేజీలో బాలుడు పడ్డాడు.  బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, డీఆర్‌ఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాలింపు చేపట్టారు. చివరకు ఆయుష్ అసుపత్రి సమీపంలో బాలుడి మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. డ్రైనేజీలపై పైకప్పు వేయాలని అధికారులను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్