ఆంధ్రప్రదేశ్: శ్రీసత్యసాయి జిల్లా(Sathya Sai District)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం బొలెరో, ఆటో ఒకదానికొకటి ఢీ కొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఆక్సిడెంట్ అయిన కొద్దీ క్షణాల్లోనే ఐదుగురు మృతి చెందగా.. మరొక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ దుర్ఘటన సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పోట్లపర్రి వద్ద.. ధర్మవరం నుంచి బత్తలపల్లి వెళ్లుతుండగా జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.
Read Also: కవిత అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం
Follow us on: Youtube Instagram