శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నం.2 గా శివాజీ, లయ హీరో హీరోయిన్లుగా ఓ సరికొత్త క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా తో సుధీర్ శ్రీరామ్ అనే దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమ కి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా కి నిర్మాత కూడా శివాజీ కావడం మరో విశేషం. ఈ చిత్రానికి సంబందించిన పూజ కార్యక్రమాలు ఇటీవలే నిర్వహించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దిల్ రాజు మరియు దర్శకులు బోయపాటి శ్రీను చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందుకోగా, ఫస్ట్ డైరెక్షన్ బోయపాటి శ్రీను చేసారు.
ఇంతకు ముందు శివాజీ లయ జంటగా కలిసి నటించిన సినిమాలు ‘మిస్సమ్మ’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, మరియు ‘అదిరిందయ్యా చంద్రం’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే కాకుండా ఇద్దరికీ హిట్ పెయిర్ అనే ట్యాగ్ ని కూడా అందించాయి. మళ్ళీ వీరిరువురు జంటగా నటించనుండటం తో, అటు పరిశ్రమ లో ఇటు ప్రేక్షకుల్లో యెనలేని ఆసక్తి నెలకొంది.
ఈ నెల 20 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి!