స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచే కుండపోతగా వర్షం కురుస్తోంది. నగరంలోని నేరేడ్‌మెట్, కుత్భుల్లాపూర్, సైదాబాద్, ముషీరాబాద్, వనస్థలిపురం, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, భాగ్యలత, ఆటోనగర్, అబ్దుల్లాపూర్‌మెట్, అనాజ్‌పూర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ధాటికి పలుచోట్ల నాలాలు పొంగిపొర్లాయి. రహదారులపై పెద్దఎత్తున నీరు పోయాయి. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరికొన్నిచోట్ల వృక్షాలు విరిగిపడటంతో ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.