మనదేశం జనాభాలోనే కాదు.. కండోమ్స్ వాడకంలోనూ దూసుకుపోతుంది. తాజాగా ఓ సర్వే నిర్వహించగా ఈ విషయం తేలింది. కండోమ్స్ వాడకంలో ప్రపంచంలో మనదేశం రెండవ స్థానంలో నిలిచింది. భారతదేశంలో ప్రతీ సంవత్సరం ఏకంగా 2 బిలియన్ల కండోమ్స్ అమ్ముడుపోతునట్లు ఈ సర్వే వెల్లడించింది. ఇందులో కేవలం 8.9 శాతం మంది పెళ్లైన మహిళలు, 10.3 శాతం పెళ్లైన పురుషులు కండోమ్స్‌ను ఉపయోగిస్తున్నారు. మిగిలిన వాటా మొత్తం పెళ్లికాని జంటలదే.
అధిక సంఖ్యలో పెళ్లికాని జంటలు కండోమ్స్ వాడటం వల్లే రికార్డ్ స్థాయి వాడకం నమోదయినట్లు తెలుస్తోంది. అక్రమ సంబంధాలు, పరస్త్రీ వ్యామోహం, లివింగ్ రిలేషన్ షిప్ లాంటివి పెట్టుకోవడం… కాండోమ్స్ ఎక్కువగా వాడటానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇందులో గమనించవలసిన విషయం ఏంటనే… గతంలో శృంగార సంబంధిత వ్యాధులు దరిచేరకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేవారు. నేటికి ఆ ప్రచారాలు కాస్త తక్కువైనా.. ఇంత మొత్తంతో కండోమ్స్ వాడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.