35.8 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర

హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభయ్యే ఈ యాత్ర సికింద్రాబాద్ లోని తాడిబండ్ ఆలయం వరకూ సాగనుంది. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఎక్కడెక్కడ ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందో హైదరాబాద్‌ సీపీ రూట్‌ మ్యాప్‌ విడుదల చేశారు. శోభాయాత్ర గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ప్రారంభమై కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసి క్రాస్ రోడ్, అశోక్ నగర్ ఎక్స్ రోడ్, బన్సీలాల్ పేట్ మీదగా సికింద్రాబాద్ తాడ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరుగుతుంది.

  దాదాపు 13 కిలోమీటర్ల మేర హనుమాన్ శోభా యాత్ర జరుగుతుండడంతో 12వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. హనుమాన్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని సూచించారు. అదేవిధంగా హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశించారు. ఈ నిబంధనలు రేపు ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి. ఈ శోభయాత్ర సాగే రూట్లలో 450 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి శోభాయాత్ర పర్యవేక్షణ చేస్తున్నారు. వెహికిల్ మౌంటెడ్ జూమ్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్