ప్రముఖ శైవక్షేత్రం పాదగయా శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయలో మహాశివరాత్రి పర్వదినానికి పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి పాదగయ క్షేత్రం… భారీగా వస్తున్న భక్తులతో కిటకిట లాడుతోంది. భక్తుల తాకిడితో పాదగాయ జనసంద్రంగా మారింది. పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వయం భూ దత్తాత్రేయ స్వామి… కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా ప్రత్యేక క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. పుష్కరిణిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను ఆలయ అధికారులు అందుబాటులో ఉంచారు.