Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

జ్ఞానవాపీ మసీదు కింద శివాలయం

      జ్ఞానవాపి మసీదు ఇప్పటిది కాదు. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో మంత్రిగా పనిచేసిన తోడర్‌మల్లు అప్పట్లో కాశీ విశ్వేశ్వరాలయం నిర్మించారని చరిత్ర చెబుతోంది. అదే సందర్భంలో విశ్వేశ్వ రాలయం పక్కనే జ్ఞానవాపి పేరుతో ఒక ఆలయాన్ని కూడా నిర్మించినట్లు చెబుతారు. ఈ వాదనకు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే ఔరంగజేబు హయాంలో జ్ఞానవాపి పేరుతో ఉన్న ఆలయం కూల్చివేత జరిగిందన్నది హిందూ సంఘాల వాదన. 1669లో శివాలయాన్ని కూల్చి జ్ఞానవాపి మసీదు నిర్మించారన్నది హిందూ సంఘాల వాదన. ఇందుకు సంబంధించి వార‌ణాసి కోర్టులో 1991లో పిటిష‌న్ దాఖ‌లైంది.

      జ్ఞానవాపి అంటే జ్ఞాన కూపం అని అర్థం. పేరును బట్టే ఇది హిందువులకు సంబంధించినది అనే విషయం తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే విషయం చెబుతు న్నారు. అయితే చరిత్రలో ఎక్కడో ఏదో జరిగిందనీ, దానిని సరిదిద్దుకోవడానికి ముస్లిం వర్గాలు ముందుకు రావాలని యోగి ఆదిత్యనాథ్ కోరుతున్నారు. జ్ఞానవాపి విషయంలో హిందువుల మనోభా వాలను గౌరవించాలని ముస్లిం వర్గాలను యోగి ఆదిత్యనాథ్ కోరారు. చాలా ఏళ్ల కిందటే జ్ఞానవాపి మసీదు అంశం వివాదంగా మారింది. వివాదం కాస్తా కోర్టు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో మసీదు నిర్మాణంపై విచారణ జరపాలని భారత పురావస్తు శాఖను స్థానిక కోర్టు ఆదేశించింది. స్థానిక కోర్టు ఆదేశా లతో పటిష్ఠ పోలీసు భద్రత మధ్య 2022 మే 14,15,16 తేదీలలో వీడియోగ్రఫీ సర్వేను నిర్వహిం చారు. కాగా జ్ఞాన‌వాపి మ‌సీదు సముదాయంలో సర్వే సందర్భంగా శివలింగం కనిపించిందన్న వార్త వచ్చింది. దీంతో సదరు ప్రాంతాన్ని సీల్ చేయాలని 2022 మే 16న వారణాసి కోర్టు ఆదేశించింది. జ్ఞాన వాపి ప్రాంతంలోకి ప్రవేశానికి ఎవరికీ అనుమతి ఇవ్వరాదని స్పష్టం చేసింది.

     జ్ఞానవాపి ప్రాంతాన్ని రక్షించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను 2022 మే 17న సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ముస్లింలు ప్రార్థనలు చేయడానికి వీలుగా మసీదులోకి ప్రవేశాన్ని అడ్డుకోవద్దని సుప్రీంకోర్టు పేర్కొంది.తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది. జ్ఞానవాపి ఆలయం చాలాకాలం పాటు మనుగడలో ఉందన్నది చరిత్ర పరిశోధకులు మాధురీ దేశాయ్ వాదన. కన్నౌజ్ రాజు జయ చంద్రుని ఓటమి తరువాత ఆలయం స్థానే జ్ఞానవాపి మసీదు నిర్మాణం జరిగి ఉండొచ్చు అంటున్నారు మాధురీ దేశాయ్. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించుకుని తీరాలి. మసీదు బేస్‌మెంట్‌లో హిందూ దేవతా మూర్తుల ఆనవాళ్లు ఉన్నట్లు హిందువుల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ అంటున్నారు. జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయం ఆనవాళ్లు ఉన్నట్లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో స్పష్టమైందంటున్నారు విష్ణు శంకర్ జైన్. అంతేకాదు ఆలయ ప్రాంగణంలో తెలుగు, కన్నడ, దేవనాగరి సహా 34 భాషల్లో శాసనాల ఆనవాళ్లు ఉన్నట్లు సర్వే నిపుణులు తేల్చి చెప్పారని విష్ణు శంకర్ జైన్ వెల్లడించారు. అంతేకాదు ఈ శాసనాల్లో రుద్ర, జనార్దన, మహేశ్వర వంటి హిందూ దేవతల ఆకృతులు ఉన్నాయని సర్వే నివేదికను ఉదహరిస్తూ విష్ణు శంకర్ జైన్ తెలియచేశారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్