25.2 C
Hyderabad
Friday, November 14, 2025
spot_img

శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కథానాయకుడిగా హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్యాన్ ఇండియా లెవెల్‌లో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ‘ఘోస్ట్’ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఘోస్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ ఆకట్టుకునే పోస్టర్‌తో అనౌన్స్ చేశారు. శివరాజ్ కుమార్ గన్ తో సీరియస్ లుక్ తో ఉన్న రిలీజ్ పోస్టర్ ఘోస్ట్ ఆగమనాన్ని ప్రకటిస్తోంది. పోస్టర్ మీద ఉన్న క్యాప్షన్ “When Shadows Speak… Know The Ghost Is Arriving” అంచనాలు మరింత పెంచేలా ఉంది. ఘోస్ట్ నుండి వచ్చిన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్, బిగ్ డాడీ టీజర్ ల తర్వాత అతు ట్రేడ్ లోనూ ఇటు ప్రేక్షకుల్లో చిత్రం పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఆకట్టుకునే ఘోస్ట్ ప్రచార చిత్రాల తో పాటు, ఇటీవల బ్లాక్ బస్టర్ జైలర్ లో శివన్న పాత్రకు వచ్చిన ట్రేమెండస్ రెస్పాన్స్ ఘోస్ట్ పై మరింత హైప్ ను తీసుకొచ్చింది. తమ భాషల్లో ఘోస్ట్ రైట్స్ కోసం పెద్ద పెద్ద బ్యానర్ ల నుండి ఆఫర్స్ వస్తున్నాయి. చిత్ర బృందం అక్టోబర్ రెండవ వారం నుండి దేశవ్యాప్తంగా స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ రెండవ వారంలో ట్రైలర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. మోహన్ బి కేరే ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని లావిష్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఘోస్ట్ అక్టోబర్ 19న దసరా కు ప్రేక్షకుల ముందుకి రానుంది.

నటీనటులు :

డాక్టర్ శివరాజ్ కుమార్, అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయన్, అర్చనా జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న మరియు తదితరులు

టెక్నీషియన్స్ :

ప్రొడక్షన్ హౌస్: సందేశ్ ప్రొడక్షన్స్ (31 వ చిత్రం)
సమర్పణ: సందేశ్ నాగరాజ్ (ఎమ్మెల్సీ)
నిర్మాత: సందేశ్ ఎన్.
కథా, దర్శకత్వం: శ్రీని
సంగీతం: అర్జున్ జన్య
సినిమాటోగ్రఫీ: మహేంద్ర సింహ
యాక్షన్ కొరియోగ్రఫీ: చేతన్ డిసౌజా, వెంకట్ (హైదరాబాద్), అర్జున్ రాజ్, మాస్ మద
ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్
పీఆర్వో: వెంకటేష్, బీఏ రాజు & టీమ్
డిజిటల్ పి ఆర్ ఓ: సెబాటిన, సతీష్
ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్: అర్చనా దినేష్
మార్కెటింగ్: శృతి ఐఎల్, సంతోష్ నందకుమార్, నిషా కుమార్, రాఘవన్ లక్ష్మణ్,
డిజిటల్ మార్కెటింగ్: ఎస్ ఐ ఎల్ స్టూడియోస్

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్