- ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేయాలని సవాల్
- కేసీఆర్ తనతో కలిసి పాదయాత్ర చేసేందుకు షూ బాక్స్ పంపిన షర్మిల
హైదరాబాద్: తన పాలన అద్భుతమంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తనతో పాటు ఒక్కరోజు పాదయాత్ర చేస్తే.. తెలంగాణలో ప్రజల సమస్యలు ఏంటో తెలుస్తాయని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. రాష్ట్రంలో సమస్యలు లేవని కేసీఆర్ నిరూపిస్తే.. ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి ఇంటికి వెళ్లిపోతానని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ సమస్యలున్నట్లు తేలితే.. కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని సవాల్ విసిరారు షర్మిల. వైఎస్సార్ హయాంలో సామాన్యులు సైతం సీఎంను కలిసే అవకాశం ఉండేదని, ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులే ఆయన్ను కలిసే పరిస్థితి లేదని షర్మిల చెప్పారు.
