బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చిహ్నంలో అమర వీరుల స్థూపం పెట్ట డాన్ని స్వాగతిస్తున్నామని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. చిహ్నం లో చార్మినార్‌ను తొలగించే ధైర్యం మీకుందా? అని ప్రశ్నించారు. ముస్లీంల పాలకుల చిహ్నాలు. ఆన వాళ్లు చాలా ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తొలగిస్తామని తెలిపారు. చార్మినార్ ను లోగో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాకతీయ తోరణం లోగో నుంచి తీసివేయాలని అనుకో వడం శోచనీయం అన్నారు. కాకతీయ తోరణం తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.


