35.2 C
Hyderabad
Sunday, May 26, 2024
spot_img

సొమ్ములున్న వాళ్లకే సీట్లు … గెలుపు కోసం నేతల ఫీట్లు

    ప్రస్తుతం ఎన్నికలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నికల్లో ధనప్రవాహం ఏడాదికేడాదికి పెరుగు తోంది. డబ్బులు లేకపోవడంతోనే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం విశేషం. ప్రస్తుతం డబ్బు సంచులే ఎన్నికలను శాసిస్తు న్నాయన డానికి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలే ఉదాహరణ. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఒకరిని మించి మరొకరు డబ్బులు వెదజల్లుతున్నాయి. మరోవైపు రాజకీయపార్టీలు కూడా సొమ్ము లున్న వాళ్లకే టికెట్లు ఇస్తున్నాయి. ఎంత ఎక్కువగా సొమ్ములు ఖర్చు పెడితే అంతగా గెలుపు అవకాశా లుంటాయని రాజకీయ పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చేశాయి.

    లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్‌ నుంచి పోటీ చేయాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తనను కోరారన్నారు. అయితే ఎన్నికల ఖర్చు భరించే ఆర్థిక స్థోమత తనకు లేదన్నారు. ఈ కారణంతోనే ఎన్నికల్లో పోటీ చేయాలన్న పార్టీ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. డబ్బులు లేకపోవడంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉన్నానంటూ నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన రాజకీయాల్లో దుమారం రేపింది. నిర్మల ప్రకటనతో ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ స్థాయిలో ఉందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో ఎన్నికల ఖర్చు చాలా తక్కువగా ఉండేది. ఎన్నికల గోదాలోకి దిగేవారు ఎక్కువమంది సమరయోధులు కావడం దీనికి ఒక కారణం కావచ్చు. స్వాతంత్ర్య సమరయోధులుగా సమాజంలో వారికి ఉన్న ఇమేజ్‌ను చూసి ప్రజలు ఓట్లేసేవారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరానికి మించి డబ్బు ఖర్చు పెట్టా ల్సిన పరిస్థితులు అప్పట్లో ఉండేవి కావు. అయితే ఇదంతా గతం.

    దేశ రాజకీయాల్లో 1962 నుంచి అనూహ్య మార్పులు సంభవించాయి.అప్పటివరకు ఎన్నికల్లో డబ్బు ఒక అంశమే కాదు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ రాజకీయాల్లో విలువల పతనం మొదలైంది. దీంతో పాటు రాజకీయాల్లో ధనప్రవాహం పెరగడం మొదలైంది. వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న సంప న్నులు రాజకీయాల్లోకి రావడం ప్రారంభమైంది. రకరకాల వ్యాపారాలతో డబ్బులు పోగేసుకున్న వారికి రాజకీయ అండ అవసరమైంది. దీంతో నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండే నాయకుల స్థానంలో అవినీతితో సొమ్ములు పోగేసుకున్న నియో రిచ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మొదలైంది. అప్పటి వరకు రాజకీయపార్టీల అధినేతలకు అనుచరులుగా ఉంటూ వచ్చిన బడా వ్యాపారవేత్తలు ప్రత్యక్ష రాజకీయా ల్లోకి రావడం మొదలెట్టారు. ఇలా అవినీతితో వందలు, వేల కోట్ల రూపాయలు కూడబెట్టిన వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభమైంది. పార్టీ టికెట్ కోసం ఆయా పార్టీల అధినేతలకు కుబేరు లు భారీగా సొమ్ములు అందచేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో క్రమక్రమంగా ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా పెరిగింది.

    ఒక్కో అభ్యర్థి ఎన్నికల్లో గెలుపు కోసం యాభై నుంచి వంద కోట్లు ఖర్చు పెడుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఎన్నికలంటే డబ్బు వెదజల్లడమే అనే మాట సర్వసాధారణమైంది. ప్రతి రోజూ వందల మందితో అభ్యర్థులు ర్యాలీలు ఏర్పాటు చేస్తున్నారు. అలాఇలా కాదు.భారీ ర్యాలీలు. ర్యాలీ ఎంత భారీగా ఉంటే రాజకీయ వర్గాల్లో అంత క్రేజ్‌. ర్యాలీల్లో పాల్గొన్నవారికి బిర్యానీ పొట్లాలు, మద్యం సీసాలు, బేటా కింద సొమ్ములు అందచేయడం మామూలైంది. దీంతోపాటు పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ గల్లీ నాయకులను పట్టుకుని గంపగుత్తగా అందరి ఓట్లు వేయించాలని కోరుతూ భారీ ఎత్తున డబ్బులు పంచే సంస్కృతి బాగా పెరిగింది.

    మరో వైపు భారీగా డబ్బులు ఖర్చు పెట్టలేని వ్యక్తి ఎన్నికల్లో పోటీకి పనికిరాడన్న అభిప్రాయానికి రాజకీయ పార్టీలు కూడా వచ్చాయి. ఎన్నికలంటేనే డబ్బు సంచులతో పని అనే అభిప్రాయం రాజకీయ పార్టీల్లో బలంగా నాటుకుంది. ఒక్క వామపక్షాలను మినహాయిస్తే అన్ని పార్టీల అభ్యర్థులు ఎక్కడ్నుంచి పోటీ చేసినా విచ్చలవిడిగా సొమ్ములు వెదజల్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో మొన్న ఈమధ్య జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు ఉప ఎన్నికల్లోనూ ఓటుకు ఐదు వేలకు పైగా సొమ్ములు చెల్లించినట్లు తెలంగాణ సమాజం కోడైకూసింది. ఒకదశలో ..తెలంగాణలో అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా హుజూ రాబాద్ రికార్డు సృష్టించింది.

మూడు నెలల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున సొమ్ములు చేతులు మారినట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఓటర్లు ఆకర్షించడానికి నేతలు పెద్ద ఎత్తున నగదు పంచినట్లు తెలు స్తోంది.ఆకస్మిక తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, లిక్కర్ తదితర వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రమంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ పోలీసులు చేస్తున్న తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారాన్ని స్వాధీనం చేసున్నారు. స్థానిక పోలీస్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, టాస్క్ ఫోర్స్‌తో పాటు ఇతర విభాగాలు 24 గంటలు పర్యవేక్షిస్తూ.. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయ డంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న నగదు పట్టుబడింది.

Latest Articles

ముంచుకొస్తున్న రెమాల్ తుఫాన్

రెమాల్ తుఫాను దూసుకొస్తోంది. బెంగాల్‌, అస్సోం, మేఘాలయలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. తుఫాను కారణంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేసి, విమాన రాకపోకలు నిలిపివేస్తు న్నారు. బంగాళాఖాతంలో రెమాల్‌ తుఫాన్‌ బలపడింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్