తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ వ్యాధులు పంజా విసురుతన్నాయి . రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వైరల్ ఫీవర్లు పెరగుతున్నాయి. డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా వంటి రోగాలతో హైదరాబాద్ నగరం అల్లాడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరిగి ఆస్పత్రులు కిక్కిరిపోతున్నాయి. చాలా మంది చిన్నారులు డెంగ్యూ బారినపడుతుండగా..ప్టేట్ లెట్స్ సైతం పడిపోతున్నాయి.
ఒక్క రోజులోనే 600ల మంది రోగులు తమ వద్దకు వచ్చినట్టు ఫీవర్ ఆస్పత్రి సూపరిండెంట్ తెలిపారు. అయితే,.. వీరిలో ఐదుగురు డెంగ్యూ బారిన పడ్డారని వెల్లడించారు. అయితే,.. డెంగ్యూ, చికెన్ గున్యాను గుర్తించడంలో అయోమయం నెలకొందన్నారు. తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి లక్షణాలతో వచ్చిన ఒక రోగికి.. వైద్యులు మొదట డెంగ్యూగా అనుమానించారని.. అయితే,.రోగికి డెంగ్యూ నెగెటివ్ అని తేలిందని.., ఆ తర్వాత చికున్‌గున్యా పరీక్ష లో పాజిటివ్‌గా తేలిందని వివరించారు. వైరల్, డెంగ్యూ, చికున్‌గున్యాను గుర్తించడంలో వైద్యులు సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు ఒకే విధంగా ఉండటంతో వ్యాధిని నిర్ధారించడంలో కష్టతరమవుతోందని తెలిపారు.
చికెన్, డెంగ్యూ లక్షణాలు ప్రారంభదశలో గుర్తించడం ఇబ్బందిగా మారిందంటున్న వైద్యులు… డెంగ్యూ లాంటి లక్షణాలు కనిపించినా పరీక్షల్లో నెగిటివ్‌గా వస్తోందని.. చికున్‌గున్యా పాజిటివ్‌గా వస్తోందని తెలిపారు. వైరల్ ఫీవర్ కేసులు కూడా ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉంటున్నాయని.. దీని వల్ల రోగులకు మొదట్లో డెంగ్యూ ఉందని తెలియడం లేదని.. వ్యాధి తీవ్రరూపం దాల్చినప్పుడు చికిత్స కోసం పరుగెత్తుకు వస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో డెంగ్యూ, వైరల్ ఫీవర్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు.